తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే హైదరాబాద్ లోని తన నివాసంపై దాడి జరిగిందని మండిపడ్డారు. తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేసి, వస్తువులు పగలగొడుతూ, బీభత్సం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో వున్న తన తల్లిని బెదిరించారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ను పీఎంఓకి, మోదీకి ట్యాగ్ చేశారు.

 

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఇంట్లో నానా విధ్వంసం సృష్టించారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి అంటూ రెచ్చిపోయారు. ఎంపీ అర్వింద్ ఇంట్లోకి చొచ్చుకెళ్లి ఫర్నీచర్, పూల కుండీలను ధ్వంసం చేశారు.అంతేకాకుండా ఆయన ఇంటి ముందే అర్వింద్ దిష్టి బొమ్మను ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్ పై మండిడప్డారు. మరోమారు నోరు పారేసుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా తాను ఓడిస్తానని ప్రకటించారు.