బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఇంటెలిజెన్స్ విభాగం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మళ్లీ మొరాయించింది. అఫ్జల్ గంజ్ మార్కెట్ వద్ద ఆయన కారు మొరాయించింది. దీంతో రాజాసింగ్ కారు దిగి, నడుచుకుంటూ వెళ్లిపోయారు. తాను ఉగ్రవాదులకు హిట్ లిస్టులో వున్నానని, అయినా… ప్రభుత్వం పదే పదే మొరాయించే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించిందని మండిపడ్డారు. దీనిని మార్చాలంటూ పదే పదే విజ్ఞప్తి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయితే… గతంలోనూ ఇలాగే జరిగిందని వెల్లడించారు. 4 నెలల క్రితం రోడ్డు మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోయిందని, అప్పుడు ఇంటెలిజెన్స్ కార్యాలయానికే పంపిస్తే.. మరమ్మతులు చేసి ఇచ్చారన్నారు. మళ్లీ 2 నెలల క్రితం మొరాయించిందని అసహనం వ్యక్తం చేశారు. దీంతో తాను గన్ మెన్లతో ఆటోలోనే కోర్టుకు వెళ్లానని పేర్కొన్నారు.