మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభ్యర్థి అని బీజేపీ ప్రకటించింది. కోమటిరెడ్డి బీజేపీ పక్షాన సోమవారం తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా పలువురు నేతలు పాల్గొంటారని పార్టీ తెలిపింది. నామినేషన్ సందర్భంగా ర్యాలీ, సభ నిర్వహిస్తామని పార్టీ ప్రకటించింది.

 

కోమటిరెడ్డి అభ్యర్థిత్వం ప్రకటనతో ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. అధికార టీఆర్ఎస్ పక్షాన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో వుంటారు. శుక్రవారమే సీఎంకేసీఆర్ కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటించి, బీ ఫామ్ కూడా అందజేశారు. ఇక.. బీజేపీ పక్షాన కోమటిరెడ్డి బరిలో నిలవనున్నారు. కాంగ్రెస్ పక్షాన పాల్వాయి స్రవంతి బరిలో నిలవనున్నారు.