వేతన జీవులకు భారీ ఊరటనిచ్చిన మోదీ సర్కార్.. ఆదాయ పన్ను పరిమితి 7 లక్షలకు పెంపు

ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 5 లక్షలు వున్న ఆదాయపు పన్ను పరిమితిని 7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్సులు కట్టాల్సిన పనిలేదన్నమాట. 9 లక్షల ఆదాయం వున్న వారు మాత్రం 5 శాతం ట్యాక్స్ కట్టాల్సి వుంటుంది. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 -రూ.9 లక్షల వరకు 5శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
0-3 లక్షల వారికి నిల్
6-9 లక్షల వరకు 10 శాతం
9-12 లక్షల వరకు 15 శాతం
12-15 లక్షల వరకు 20 శాతం
15 లక్షలు ఆదాయం దాటితే 30 శాతం పన్ను

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. రైల్వేకు రూ.2.4లక్షల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రేట్ల నిధులు కేటాయించామన్నారు. ‘పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు. పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ పద్దు చదివారు.

విద్యుత్ రంగం….

నేష‌న‌ల్ హైడ్రోజ‌న్ గ్రీన్ మిష‌న్‌కు రూ. 19,700 కోట్లు కేటాయింపు. విద్యుత్ రంగానికి రూ. 35 వేల కోట్లు. ఏడాదికి అర్బ‌న్ ఇన్‌ఫ్రా ఫండ్ రూ. 10 వేల కోట్లు. గోబ‌ర్ద‌న్ స్కీం కింద 200 బ‌యో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు. ల‌డాఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టు ఏర్పాటు. ఎన‌ర్జీ ట్రాన్సిష‌న్ కోసం రూ. 38 వేల కోట్లు. యువ‌త‌లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్ర‌ధాన‌మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న ప‌థ‌కం అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

కాలం చెల్లిన వాహ‌నాల తొల‌గింపు మా త‌క్ష‌ణ ప్రాధాన్యం

కాలం చెల్లిన వాహ‌నాల తొల‌గింపు మా త‌క్ష‌ణ ప్రాధాన్యం. కేంద్ర ప్ర‌భుత్వ వాహ‌నాలు మార్చేందుకు ప్ర‌త్యేక నిధులు. కొత్త వాహ‌నాల కొనుగోలుకు రాష్ట్రాల‌కు సాయం అందిస్తాం. వాహ‌నాల తుక్కు కోసం మ‌రిన్ని నిధులు కేటాయింపు. అయితే… కాలం చెల్లిన వాహనాల తొలగింపు అనబోయి… నిర్మలా సీతారామన్ పొలిటికల్ అన్న పదం వాడారు. దీంతో సభలోని సభ్యులందరూ గట్టిగా నవ్వారు. ఆ తర్వాత సీతారామన్ సరి చేసుకున్నారు.

ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్ల నిధులు. ఎంఎస్ఈలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వ్యాపార సంస్థ‌ల‌కు డిజిలాక‌ర్ సేవ‌ల విస్త‌ర‌ణ‌. 5జీ సేవ‌ల యాప్‌ల అభివృద్ధికి వంద ప‌రిశోధ‌నా సంస్థ‌లు. 50 ఎయిర్‌పోర్టుల పున‌రుద్ధ‌ర‌ణ‌. ట్రాన్స్‌పోర్టు రంగానికి ప్రాధాన్య‌త‌న‌. క్లీన్ ప్లాంట్ కార్య‌క్ర‌మానికి రూ. 2 వేల కోట్లు. మూడు కొత్త ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సెంట‌ర్లు. వ్యాపార సంస్థ‌ల‌కు ఇక‌పై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.

Related Posts

Latest News Updates