యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జులై 7న భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.
భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. జులై 7న సాయంత్రం ఆరు గంటల నుంచి ఎన్ కన్వెన్షన్‌లో భారతీయుడు 2 వేడుక జరగనుంది.
28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది. ఈ తరుణంలో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగ్యనగరంలో భారీ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు.
సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారోనంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు సహా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించగా, ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేశారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందించారు.