పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన బెంగళూరుకి చెందిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయ్యింది. బెంగళూరుకు చెందిన న్యూ హోరిజోన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అయితే… వీరు ఉద్దేశపూర్వకంగా నినాదాలు చేయలేదని పోలీసులు ప్రకటించి, వారిని విడుదల చేశారు. అయితే… న్యూ హోరిజోన్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం మాత్రం వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.
కాలేజీ ఫెస్ట్ కి సంబంధించిన కార్యక్రమాల్లో వుండగా… ఆయా విద్యార్థులు తమకు నచ్చిన ఇండియన్ ప్రీమియ్ లీగ్ టీమ్స్ కి , దేశాలకు సపోర్ట్ చేస్తూ నినాదాలు చేశారు. అందులో ఆర్యన్, దినకర్, రియా అనే ముగ్గురు విద్యార్థులు మాత్రం పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ విద్యార్థులపై మరాఠాహల్లి పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా వారి తల్లిదండ్రులను కాలేజీ యాజమాన్యం పిలిపించి, వారు చేసిన నిర్వాకాన్ని వివరించింది. ఆ తర్వాత వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.












