బెంగాల్ బీజేపీ చేపట్టిన చలో సెక్రెటేరియట్ ఉద్రిక్తత… కీలక నేతల అరెస్ట్

బెంగాల్ లో బీజేపీ నేతలు నబన్న అభియాన్ పేరుతో ఛలో సెక్రెటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ హింస చెలరేగింది. బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రాష్ట వ్యాప్తంగా వున్న బీజేపీ నేతలందరూ ఈ మార్చ్ లో పాల్గొనడంతో వారిని ఆపేందుకు పోలీసులు కష్టాలు పడ్డారు. అయితే… ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అనేక మందిని అరెస్ట్ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ఉపపయోగించారు. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్ష నేత సుబేందును, బీజేపీ నేతలైన లాకెట్ ఛటర్జీ, తాప్షి మోండల్ తో పాటు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఈ సందర్భంగా సీఎం మమతపై సుబేందు అధికారి మండిపడ్డారు. రాష్ట్రంలో లేడీ కిమ్ గా మమత వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉతర్త కొరియాను కిమ్ ఎలాగైతే పరిపాలిస్తున్నారో… మమతా బెనర్జీ కూడా బెంగాల్ ను అలాగే పాలిస్తున్నారని విమర్శించారు. ప్రజా తిరుగుబాటును చూసి మమత సర్కార్ భయపడుతోందని అన్నారు.

 

Related Posts

Latest News Updates