టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రకటన

టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్ర కారు ప్రమాదానికి గురయ్యాడు. న్యూ ఇయర్ వేడుకలకు సర్ ప్రైజ్ ఇద్దామనిఅనుకొని, రూర్కీ దగ్గర పంత్ కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంత రిషబ్ పంత్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఉత్తరాఖండ్ లోని రూర్కీ నంచి ఢిల్లీ వెళ్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో కారులో బాగా మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రగా గాయపడ్డాడు. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పంత్..కారు అద్దాలు పగులకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. అయితే ప్రమాద సమయంలో పంత్ నిద్రపోతూ కారు నడిపినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోక్ కుమార్ తెలిపాడు. ఈ ప్రమాదంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆయన తలకు బలంగా గాయమైంది. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో రిషబ్ పంత్ స్వయంగా కారు నడుపుతున్నాడు.

డివైడ‌ర్ వ‌ద్ద కూల‌బ‌డిపోయిన పంత్‌ను కొంద‌రు స్థానికులు ర‌క్షించారు. ఆ స‌మ‌యంలో అటుగా వెళ్తున్న వాళ్లు మండుతున్న కారు వీడియోల‌ను కూడా తీశారు. ఆ వీడియోలు ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌లో షేర్ అవుతున్నాయి. ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఇక మంట‌ల్లో అది పూర్తిగా ద‌గ్ధ‌మైంది. మరోవైపు రిషబ్ పంత్ ప్రస్తుతం ఐసీయూలో వున్నారని బీసీసీఐ ప్రకటించింది. పంత్ నుదురు చిట్లిపోయిందని, వీపుపై కాలిన గాయాలు, కుడి మోకాలి లిగ్మంట్ జరిగిపోయిందని తెలుస్తోంది. అయితే ఆరోగ్యం నిలకడగానే వుందని బీసీసీఐ తెలిపింది.

Related Posts

Latest News Updates