మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో పూల పండుగ బతుకమ్మ అంగరంగ వైభవంగా జరిగింది. మలేషియా కౌలాలంపూర్లోని డీ చక్ర రూఫ్ టాప్  హాల్, TLK కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలతో మహిళలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీ  శాసన సభ సభ్యుడు గాదారి కిషోర్ కుమార్, బీజేపీ శాసన సభ సభ్యుడు రఘు నందన్, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్, ఇండియన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ సుష్మ, మలేషియా టీఆర్ఎస్ వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు పలువురు తెలంగాణ ప్రముఖులు విచ్చేశారు.  తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించడంతో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్ మారుతీ, జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణరెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, రోజా, శ్రీలత.. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం