బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ నాలుగో విడత పాదయాత్ర కొనసాగుతోంది. 9 వ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్, కొత్తపేట, చైతన్యపురి వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా నాగోలు మహిళలు మంగళహారుతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అయితే.. ఈ సారి స్వాతంత్రం కోసం ఉద్యమించిన వారి సమర యోధుల వేషధారణలో పిల్లలు బాగా ఆకట్టుకున్నారు.

 

ఎంఐఎం కనుసన్నల్లోనే పీఎఫ్ఐ పనిచేస్తోందని, టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకూ రాష్ట్రంలో పీఎఫ్ఐ కార్యకలాపాల గురించి ప్రభుత్వానికి తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఏ స్కామ్ జరిగినా… అందులో కేసీఆర్ కుటుంబ ప్రమేయం వుంటుందని, ఢిల్లీ స్కామ్ పై ఎందుకు నోరు మెదపడం లేదని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు.