సీఎస్ సోమేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తక్షణమే రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును శిరసావహిస్తూ… సీఎస్ సోమేశ్ ను సీఎస్ బాధ్యతల నుంచి తప్పించి, ఏపీకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం అని బండి సంజయ్ ఆక్షేపించారు.

తెలంగాణకు కేటాయించిన ఎందరో అధికారులు సీనియారిటీ జాబితాలో వుండగా… ఏపీకి కేటాయించిన సోమేశ్ ను సీఎస్ గా నియమించి, సీఎం కేసీఆర్ లబ్ధి పొందారని బండి ఆరోపించారు. 317 జీవోతో సహా.. అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ ద్వారా విడుదల చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులు నియమించుకొని, అవినీతికి సోమేశ్ ను పావుగా వాడుకున్నారని బండి సంజయ్ అన్నారు.