బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 13 వ రోజు కొనసాగుతోంది. కోరుట్ల జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ఇక… బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఆవిర్బావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా వుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ చెల్లని రూపాయిగా మారారని, ఆయన ముఖం చూసి ఓట్లేసే రోజులు పోయాయని చెప్పారు.బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వెళ్లిన ఇతర రాష్ట్రాల నేతలంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వ్యక్తులంటూ విమర్శలు చేశారు.

 

కేసీఆర్ ముఖం చూసి జనం ఓట్లేయరన్నారు. దొంగసారా దందాతో తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతోనే రెచ్చగొట్టే యత్నంచేస్తున్నారన్నారు. ములవాడకు రూ.100 కోట్లు, బాసరకు రూ.120 కోట్లు అని ప్రకటించిన కేసీఆర్… ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కొండగట్టుకు రూ.100 కోట్లు అనడం హాస్యాస్పదమని బండి సంజయ్ దుయ్యబట్టారు.