శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండా బండా ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవమయ్యారు. ఈ పదవికి బండా ప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో ఆయన తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు అందజేశారు. డిప్యూటీ చైర్మన్ పదవికి శనివారం నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. దీంతో బండా ప్రకాశ్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్టే.
ఈ కార్యక్రమంలో మంత్రులు కే తారకరామారావు, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, మహమూద్ అలీ, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, శాసనమండలిలో విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, ఫారుక్‌హుస్సేన్ , గంగాధర్‌గౌడ్, సురభి వాణీదేవి, యెగ్గే మల్లేశం, తక్కళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, పాడి కౌశిక్‌రెడ్డి, నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, దండె విఠల్, ఎల్ రమణ, అమినుల్ హసన్‌జాఫ్రీ, ఎమ్మెల్యేలు డాక్టర్ టీ రాజయ్య, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.