నగరంలోని బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట జరిగింది. గతంలో వున్న వేలంపాట రికార్డును ఈ యేడాది బ్రేక్ చేశారు. వేలం పాటలో లడ్డూ ధర 24.60 లక్షలు పలికింది. లడ్డూను బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బలాపూర్ లడ్డు ధర 18.90 లక్షలు పలుకగా… అప్పటి కంటే ఈసారి లడ్డూ ధర 5.70 లక్షలు అధికంగా పలికిందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే… ఈ సారి జరిగిన వేలం పాటలో 8 మంది కొత్త సభ్యులు పాల్గొన్నారు. మరో వైపు 13 మంది పాత సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక… ఈ వేలంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసానితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు.