ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో బాలల సంబరాలు జరిగాయి. డల్లాస్‌లోని స్థానిక సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి 250 మంది పిల్లలు హాజరయ్యారు. దీంతో కార్యక్రమం విజయవంతమైందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, చదరంగం, గణితం, తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. పదేళ్లలోపు, పదేళ్లపైన ఉన్న చిన్నారులను రెండు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, జ్యోతి వనం, తేజ వేసంగి.. డల్లాస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు రవి తుపురాని, మణిధర్ గూడవల్లి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
