ఎన్టీఆర్ బిడ్డగా జన్మించడంతో జన్మ ధన్యమైంది : బాలకృష్ణ

తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. నట విశ్వరూపం అంటే ఏమిటో తెలియజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. ఎన్టీఆర్ బిడ్డగా జన్మించడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ప్రజల భవిష్యత్ కి భరోసా ఇచ్చిన అమ్మ, ఆడవాళ్లకు అండగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చి అన్న.. నందమూరి అని అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడం ఎన్టీఆర్ కే సాధ్యమైందని బాలకృష్ణ అన్నారు.

తెలుగు దేశం పార్టీ అనేది ఎన్టీఆర్ ఇచ్చిన ఓ గొప్ప ఆస్తి అని బాలకృష్ణ అన్నారు. కేవలం అది పార్టీ మాత్రమే కాదని, అదో వ్యవస్థ అని అన్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ హీరో అని.. ప్రజల కోసం ఎంతో సహసోపేతమైన పథకాలు తెచ్చారని బాలయ్య గుర్తు చేశారు. ఎన్టీఆర్ కి ముందు ఆ తరువాత అనే లాంటి కార్యక్రమాలు తెచ్చారన్నారు. ఎన్టీఆర్ అన్ని వర్గాల వారిని సమానంగా, సగౌరవంగా ఆదరించారని తెలిపారు. ఎన్నో ఆటుపోటులను చూసినా ఎన్టీఆర్ తల వంచలేదని అన్నారు. టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts

Latest News Updates