నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ ట్రైలర్ శుక్రవారం రిలీజైంది. ఒంగోలులో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. గోపీచంద్ మలినేనిదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయెల్ రోల్ పోషించగా.. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేలా ఉన్నాయి. బాలయ్యకి జోడీగా ఈ మూవీలో శృతి హాసన్ నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. థమన్ సంగీతం అందించాడు. ”సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో.. పెత్తనం కోసమే కాదు. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు. సీమ మీద ఎఫెక్షన్.” అంటూ ట్రైలర్‌లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్‌తో మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఈ ట్రైలర్ ను డైరెక్టర్ బి గోపాల్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం బాలయ్య బ్రాండ్, రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ అచ్చుగుద్దినట్లు అర్థమవుతుంది.
