ఒంగోలులో వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్… ఈ నెల 6 న ఫిక్స్ చేసిన నిర్వాహకులు

బాల కృష్ణ రీసెంట్ గా నటించిన చిత్రం వీరసింహా రెడ్డి. ఈ మూవీ సంక్రాంతికి బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రం యూనిట్ విపరీతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ఈ నెల 6 న ఒంగోలులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అప్పుడే ట్రైలర్ కూడా విడుదల కానుంది. వాస్తవానికి ఈ మధ్య నందమూరి బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా కర్నూలు, అనంతపురం, విజయవాడ, గుంటూరు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే ఎక్కువగా చేస్తూ వస్తున్నారు.

అదే సంప్రదాయాన్ని పాటిస్తూ జనవరి ఆరవ తేదీన ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక… మంగళవారం బాలయ్య, శ్రుతిహసన్ పై చిత్రీకరించిన మాస్ మొగుడు పాటను విడుదల చేయనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా రూపొందుతోంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Related Posts

Latest News Updates