ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రయాణించిన హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఒంగోలు ప్రీరిలీజ్ ఈవెంట్ ముగించుకొని, హీరో బాలయ్య తదితరులు హెలికాప్టర్ లో హైద్రాబాద్ కి బయల్దేరారు. అయితే… 15 నిమిషాల ప్రయాణం తర్వాత ఒంగోలులోనే హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేసేశాడు పైలట్. ఇలా అత్యవసరంగా ల్యాండ్ కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు అందరూ అనుకున్నారు. అయితే.. పైలట్ క్లారిటీ ఇచ్చాడు. పొగమంచు కారణంగానే వెనక్కి తిరిగి వచ్చేశామన్నారు. ఏటీసీ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.













