తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చాడు… కొడుకు యూనివర్శిటీ పేరు మార్చేశాడు : బాలకృష్ణ

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంపై ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా… టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పుపై తీవ్రంగా స్పందించారు. మార్చెయ్యడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని మండిపడ్డారు. ఎన్టీఆర్ అన్న పేరు ఓ నాగరికత అని, ఓ సంస్కృతి అని, తెలుగు జాతి వెన్నెముక అని అభివర్ణించారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మార్చేశాడని మండిపడ్డారు.

 

మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని, పంచభూతాలున్నాయని అన్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ నందమూరి హెచ్చరించారు. అక్కడ ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారని, పీతలున్నారని ఎద్దేవా చేశారు. విశ్వాసం లేని వారిని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని, శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

Related Posts

Latest News Updates