అయ్యప్ప స్వామిపై పిచ్చి కూతలు కూసిన హేతువాది బైరి నరేశ్ అరెస్టయ్యాడు. వరంగల్ లో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నరేశ్ ఎక్కడున్నాడనే వివరాలు పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ విషయాన్ని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటంచారు. నరేష్ పై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. తాము బైరి నరేశ్ ను అరెస్ట్ చేశామని, అయ్యప్ప స్వాములందరూ ఆందోళన విరమించాలని కోరారు.
అయ్యప్ప స్వామిపై పిచ్చి కూతలు కూసిన బైరి నరేశ్ మూడు రోజులుగా పరారీలో వున్నాడు. దీంతో పోలీసులు అతని కోసం నాలుగు టీమ్ లను ఏర్పాటు చేశారు. గాలింపులు తీవ్రం చేశారు. చివరికి వరంగల్ లో ఆయన్ను పట్టుకున్నారు. కాసేపట్లో బైరి నరేశ్ ను కొడంగల్ కు తరలించనున్నారు. మరోవైపు బైరి నరేశ్ అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఆందోళనలను నిర్వహించారు.