ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), తానా ఫౌండేషన్, తానా ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో బహుజన కళోత్సం జరిగింది. 12 గంటల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ కి బహుజన బంధు అన్న పురస్కారాన్ని అందజేశారు. బీసీల అభ్యున్నతికి తాను నిరంతరం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక…. ఈ సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి తన పాటలతో ఉత్తేజపరిచారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ వెలుగుచూడని మరెన్నో బహుజన కళా రూపాలను తమ వేదిక ద్వారా పరిచయం చేశామని, మరిన్నింటిని పరిచయం చేస్తామని ప్రకటించారు. ఇక… ఈ కార్యక్రమంలో దళవాయి చలపతి రావు, కిన్నెరమెట్ల మొగిలయ్య, కొలకలూరి ఇనాక్, ఎడ్ల గోపాలరావు, కూటికుప్పల సూర్యారావును సత్కరించారు. ఇక.. ఈ కార్యక్రమానికి తారా ఆర్ట్స్ నిర్వాహకులు రాకేశ్ సంకె సమన్వయకర్తగా వ్యవహరించారు.