డెమోక్రెటిక్ ఆజాద్ పార్టీ.. కొత్త పార్టీని ప్రకటించిన గులాంనబీ ఆజాద్

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. డెమోక్రెటిక్ ఆజాద్ పార్టీ పేరుతో ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. ఓ మీడియా సమావేశాన్ని పెట్టి… ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. పసుపు, తెలుపు, నీలం మూడు రంగులతో ఈ జెండా వుంది. పసుపు రంగు స్రుజనాత్మకతను భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని, తెలుపు శాంతిని సూచిస్తుందని, నీలం స్వేచ్ఛకు ప్రతీక అని గులాంనబీ వివరించారు. గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ పార్టీ నడుస్తోందని చెప్పుకొచ్చారు.

 

తమ పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై పార్టీ నడుస్తోందని ప్రకటించారు. పార్టీ ప్రకటనకు ముందు తన అనుయాయులు, కార్యకర్తలు, అనుచరులతో ఆజాద్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. తన పార్టీ కోసం 1,500 మంది పేర్లను తమకు పంపాలని పిలుపునిచ్చారు. ప్రజలు సూచించిన పేర్ల నుంచే తాము పార్టీ పేరును ఎంపిక చేశామని ఆజాద్ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates