దీపావళి సందర్బంగా అక్టోబర్ 21న మూవీ గ్రాండ్ రిలీజ్
‘ఏమని అనాలని తోచని క్షణాలివి
ఏ మలుపు ఎదురయ్యే పయనమిదా
ఆమని నువ్వేనని నీ జత చేరాలని
ఏ తలపో మొదలయ్యే మౌనమిదా…
ఔననవా ఔననవా..’
అంటూ ప్రేమికుడు తన ప్రేయసికి మనసులోని మాటలను పాట రూపంలో చెబితే ఎలా ఉంటుంది.. మనసుకు హత్తుకుంటుంది. ఇంతకీ ఆ ప్రేమికుడు ఎవరో కాదు.. అశోక్ సెల్వన్. ఇంతకీ ఆయన తన ప్రేమను ఎవరికీ చెప్పాడో తెలియాలంటే ‘ఓరి దేవుడా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి. యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ ‘ఔననవా..’ అంటూ సాగే మెలోడి సాంగ్ విడుదల చేసింది. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. విజయ్ ఈ చిత్రాన్ని ఎడిటర్‌గా, విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.