అవతార్ మూవీ… అదో వండర్ మూవీ. ప్రేక్షకులందర్నీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్ కామెరూన్. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ అవతార్ సినిమా వివిధ భాషల్లో విడుదలైందంటే.. ప్రేక్షకాదరణ ఏ రేంజ్ లో వుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు అవతార్ -2 సీక్వెల్ గా వచ్చేసింది. ద వే ఆఫ్ వాటర్ పేరుతో ఈ నెల 16న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. అయితే.. దీనికి తెలుగులో రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తో డైలాగ్స్ రాయించారట. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అవసరాల మంచి డెరెక్టర్ కూడా గుర్తొస్తారు. ”జ్యో అచ్యుతానంద’, ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలకు డైరెక్టర్ గా కూడా చేశాడు. బ్రహ్మాస్త్ర మూవీ తెలుగు వర్షన్ కు డైలాగులు కూడా రాశారు. ఇప్పుడు అవతార్ 2 కి డైలాగులు రాశారు.