అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనామాలో అమెరికాకు వసల వెళ్లే వారితో వెళ్తున్న బస్సు… మరో మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 39 మంది మరణించారు. చిరికీలోని గ్వాలకాలో ఈ ప్రమాదం జరిగింది. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్ రాజధాని డేవిడ్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కొలంబియా నుంచి డేరియన్ లైన్‌ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గౌలాకా శరణార్థుల శిబిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
బస్సు ఆ షెల్టర్‌ను దాటి ముందుకు వెళ్లడంతో దానిని మళ్లీ హైవేపైకి తీరుసుకురావడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటుగా వస్తున్న మరోబస్సు దానిని ఢీకొట్టింది. దీంతో అది లోయలో పడిపోయిందని పనామా అధ్యక్షుడు లారెన్షియో కార్టిజో వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 66 మంది ఉన్నారని తెలిపారు. 39 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారని, మిగిలినవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.