ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబా కిషోర్ దాస్‌పై ఓ పోలీసు అధికారి కాల్పులకు తెగబడ్డాడు. జార్సుగుడా జిల్లా బ్రజరాజ్‌నగర్‌లోని గాంధీ చౌక్ వద్ద మంత్రిపై అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ మంత్రి ఛాతీ భాగంలోకి తూటా దూసుకెళ్లడంతో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తొలుత ఆస్పత్రికి తీసుకురాగానే సీనియర్ డాక్టర్ దేబాశిస్ నాయక్ నేత్త్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన ఓ బుల్లెట్ గుండె, ఎడమ వైపు ఊపిరితిత్తుల భాగంలో గాయం చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. మంత్రి తన వాహనం నుంచి దిగుతుండగా పోలీసు అధికారి ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
బ్రజ్‌రాజ్‌నగర్ ఎస్డీపీవో గుప్తేశ్వర్ భోయ్ కథనం ప్రకారం.. బ్రజ్‌రాజ్‌నగర్ పట్టణంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్ దాస్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మంత్రి మృతి పట్ల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీఐడీని ఆదేశించారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు కాల్పుల గురించి ఇలా వివరించారు. ప్రజా ఫిర్యాదుల కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి అతిథిగా విచ్చేశారు. చాలా మంది ఆయనకు స్వాగతం పలకడానికి గుమికూడారు. ఇంతలో హఠాత్తుగా కాల్పులు జరిగాయి.