ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత ఒవైసీ స్పందించారు. కేసీఆర్ కుటుంబాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. టార్గెట్ చేస్తూ, వేధిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. దేశంలోని ముస్లింల‌ను ఆర్థికంగా వెలివేయాల‌ని బీజేపీ ఎంపీలు(BJP MPs) పిలుపునిచ్చిన‌ట్లు అస‌ద్ పేర్కొన్నారు. ముస్లింల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌ల్లో ఆయుధాలు పెట్టుకోవాల‌ని పిలుపునిచ్చిన‌ట్లు ఆరోపించారు.తెలంగాణ స‌మ‌గ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ‌ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్(CM KCR) కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఒవైసీ పేర్కొన్నారు.