మరో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీకి భారత సంతతి వ్యక్తి నేతృత్వం వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కాపీ వ్యాపార సంస్థ స్టార్‌బక్స్ తమ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఆయన యూకే కేంద్రంగా పనిచేస్తున్న రెకిట్ బెంకిజర్‌కు సీఈవోగా ఉన్నారు. ఈ కంపెనీ నుంచి సెప్టెంబరు 30న నిష్ట్రమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత మూడేళ్లుగా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నరసింహన్ ప్రముఖ స్టాప్ డ్రిరక్స్ సంస్థ పెప్సికో కంపెనీలో వివిధ నాయకత్వ హోదాల్లో పని చేశారు. స్టార్‌బక్స్, పెప్సికో మధ్య సుధీర్ఘకాలంగా పలు అంశాల్లో ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని నరసింహన్ పెప్సీకో లాటిన్ అమెరికా విభాగానికి సీఈవోగా వ్యవరిస్తున్న సమయంలో కుదిరాయి. అక్టోబరులో నరసింహన్ స్టార్‌బక్స్ లో చేరతారు. ఏప్రిల్ సీఈవో బాధ్యతల్ని స్వీకరిస్తారు. అప్పటి వరకు ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న హోవర్డ్ షూల్జ్ కొనసాగుతారు. నరసింహన్ సీఈవోగా చేరిన తర్వాత కూడా షూల్జ్ కంపెనీల బోర్డులో ఉంటారు.