కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేషుడి చిత్రాలు ముద్రించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేజ్రీవాల్

కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేషుడి చిత్రాలను ముద్రించాలని కోరుతూ… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తన ప్రతిపాదనకు దేశ వ్యాప్తంగా మద్దతు వస్తోందని, ప్రజలు కూడా ఆసక్తిగా వున్నారని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా తాను ప్రతిపాదించిన విషయాన్ని అమలు చేయాలని కోరారు. మహాత్మా గాంధీ చిత్రంతో పాటుగా దేవతా మూర్తులు లక్ష్మీ, గణేషుడి రూపాలను నోట్లపై వుంచాలని కోరుతున్నా. 130 కోట్ల మంది పక్షాన అడుగుతున్నా. దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో వుంది. 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వున్నాం. ప్రజలు శ్రమిస్తూనే వున్నారు. దేవుడి ఆశీస్సులు కూడా కావాలి అంటూ కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు.

 

 

Related Posts

Latest News Updates