ఎంసీడీ ఎన్నికల్లో ఓటు వేసిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో  సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.   సివిల్ లైన్స్ లోని పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఉందన్నారు. ఢిల్లీని శుభ్రం చేసేందుకు ఇదొక అవకాశమని కేజ్రీవాల్ అన్నారు. అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలన్నారు. అవినీతి పరులకు ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో 1.45 కోట్ల మంది త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1349 మంది అభ్య‌ర్ధులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ఎంసీడీ ఎన్నిక‌ల్లో బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ల మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది.

Related Posts

Latest News Updates