అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన చరిత్ర లిఖించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా తెలుగు నేపథ్యం వున్న అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో కూర్చోవడం ఇదే మొట్ట మొదటి సారి. అయితే… మేరీల్యాండ్‌లో అరుణా మిల్లర్‌కు పాపులారిటీ ఎక్కువగా ఉంది. రిపబ్లికన్ మద్దతుదారులు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విభజనకు బదులుగా ఐకమత్యాన్ని మేరీల్యాండ్ ఓటర్లు ఎంచుకున్నట్లు విక్టరీ ప్రసంగంలో అరుణా మిల్లర్ తెలిపారు. అరుణా మిల్లర్ ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఆమె పేరెంట్స్ అమెరికాకు వలస వెళ్లారు. 1972లో అమెరికా వచ్చానని, అప్పటి నుంచి అమెరికా కోసం పనిచేశానన్నారు.
గవర్నర్ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఒకవేళ గవర్నర్ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆ బాధ్యతల్ని చూసుకుంటారు. మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల అనంతరం అరుణా మిల్లర్ విజయాన్ని ఖరారు చేశారు.