ఆర్టెమిస్ మళ్లీ ఆగింది

చంద్రుడిపైకి పంపించేందుకు  అమెరికా అంతరిక్ష ప్రయోగా సంస్థ నాసా నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ఆర్టెమిస్‌ ప్రయోగం రెండోసారి వాయిదా పడిరది. శనివారం మధ్యాహ్నం జరగాల్సిన ప్రయోగాన్ని భారీ ఇంధన లీకేజీ కారణంగా వాయిదా వేసినట్లు నాసా తెలిపింది. 322 అడుగుల ఎత్తైన ఈ భారీ రాకెట్‌లోకి 10 లక్షల గ్యాలన్ల ద్రవీకృత హైడ్రోజన్‌ ఇంధనాన్ని నింపే కార్యక్రమం మొదలైన కాసేపటికే ఇంధనం లీకవుతున్నట్లు గుర్తించారు. ఎంత ప్రయత్నించినా లీకేజీ ఆగకపోవడంతో ప్రయోగం వాయిదా పడిరది. గత సోమవారం కూడా సెన్సార్ల లోపం, ఇంధన లీకేజీ వల్ల ప్రయోగం ఆఖరి క్షణంలో వాయిదా పడటం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన మరో ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది. దీని తేదీ మాత్రం నాసా ప్రకటించలేదు.

Related Posts

Latest News Updates