“మహిళలకు పెద్దపీట వేస్తున్న ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ”

“ఆరోహి సూయింగ్ ఎంటరప్రైజెస్ ప్రమోసనల్” యాడ్స్ ను విడుదల చేసిన హీరోయిన్ నందిత శ్వేత”

” సాధారణ మహిళగా ఎందుకు ఉండి పోవాలి”
“అసాధారణ మహిళగా ఎదగండి”

” ఆసాధారణ మహిళగా ఎదగడం అందరికీ అసాధ్యం”

“మహిళా మూర్తులకు ఆదర్శంగా నిలుస్తున్న శిరీష మల్లాడి”

బంజారా హిల్స్..హైదరాబాద్. మహిళలుకు ఇంటి దగ్గర ఉండి బోర్ కొడుతుందా అయితే ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అందిస్తున్న లేటెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ మహిళలను చైతన్యపరచడం కోసం ఓ సరికొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది ఆరోహి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ “శిరీష మల్లాడి”. తక్కువ బడ్జెట్ తో నటీనటులను తీసుకువచ్చి యాడ్ మేకింగ్ డైరెక్షన్ చేస్తున్న ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ . చిన్నచిన్న వ్యాపారవేత్తలకు తక్కువ ఖర్చుతో సుధీర్ ధీరజ్ చేస్తున్న ఈ డైరెక్షన్ సమాజంలో చెప్పుకోదగ్గ విషయం అని చెప్పవచ్చు.ఇక ఈ ప్రోగ్రాం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హీరోయిన్ నందిత శ్వేత మరియు సినీ నటులు టీవీ కళాకారులు హాజరయ్యారు.
– మహిళా నటిమనులు..
మహిళఎదగాలంటే అవరోధాలను తట్టుకుని ముందుకు వెళ్లాల్సి వస్తున్న సమాజంలో. బ్రతుకుతున్న రోజుల్లో ఓ మహిళ అందులోనూ గృహిణి ఎదగాలంటే దానికి ఎన్నో అడ్డంకులు. అందులో ముఖ్యమైన అడ్డంకులు కుటుంబ సభ్యులచేత సృష్టించి ఆ మహిళ ఎదుగుదలను ఆపేస్తారు.
తనదైన శైలిలో ఎవరు ఊహించని మల్లాడి శిరీష మంగరావు ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థను నెలకొల్పి తనతో పాటు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు అందరి మన్ననలను పొందింది.
తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా భర్త మంగారావు సహకారంతో ఈ సంస్థ నెలకొల్పి సమాజానికి తన వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో ఉన్నానని ఇంతమంది మహిళలు స్టేజిపై ఉండడం తన దక్కిన గౌరవంగా భావిస్తూ ముందుకు వెళతానని తెలిపారు…

తరాలు ఎన్ని మారినా కొత్త పోకడలు ఎన్ని వచ్చినా కుట్టుమిషన్ లేని జీవితం ఊహించలేము.మొదట్లో కుట్టు పని అంతా చేతితోనే జరిగేది. కుట్టు మిషన్ కనిపెట్టిన తరువాత చాలామంది జీవితాలు ఎంతో సుఖమయమయ్యాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కుట్టు మిషన్ ఎంతో ఆవసరం. బట్టలు కుట్టించుకోవాలి అన్నా.. రెడీమేడ్ గా తీసుకున్న బట్టల సైజ్ చేయాలన్నా.. చిన్న చిన్న డ్యామెజీ లను సరిచేయాలన్నా కుట్టు మిషన్ ఎంతో అవసరం.ఇప్పుడున్న బిజీ జీవితంలో కుట్టుమిషన్ చాలామందికి అవసరం ఉన్నా వాటిని వాడే వారు తక్కువయ్యారని చెప్పవచ్చు. అయితే ప్రతి మహిళ కూడా ఒకరిపై ఆధారపడకుండా తానే ఎదుటివారికి మార్గదర్శకంగా నిలిచి సమాజంలో తనకు తాను ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలాని ప్రభుత్వాలు సైతం తెలుపుతున్నాయి.అయితే సాధారణ మహిళ అయిన శిరీష ఒక్క కుట్టు మిషన్ తో స్టార్ట్ చేసి తన స్టిచ్చింగ్ తో ఎంతో మంది మన్ననలను పొందింది.ఆ తర్వాత తనలాగే మహిళలందరూ స్వతంత్రంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో ఆరోహి సీవింగ్ ఎంటరప్రైజెస్ అనే సంస్థను స్టార్ట్ చేసింది.ఈ సంస్థలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ తన బిజినెస్ ను ముందుకు తీసుకెళ్ళింది.తక్కువ ఖర్చుతో మొదలుపెట్టిన కేవలం ఐదు లక్షల పెట్టుబడితో తన బిజినెస్ దిన దినాభి వృద్ధి చెందుతూ నేడు 15 కోట్లకు చేరుకోవడం విశేషం.ఈ సందర్బంగా హైదరాబాద్ లో తన కస్టమర్స్, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆరోహి సీవింగ్ ఎంటరప్రైజెస్ ప్రమోషన్ యాడ్ ను విడుదల చేయడం జరిగింది.

Related Posts

Latest News Updates