ప్రముఖ నటుడు అర్జున్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం యువ కథానాయకుడు ఉమాపతి రామయ్యతో చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 2024 మార్చి లేదా ఏప్రిల్లో వివాహ వేడుక ఘనంగా నిర్వహిస్తామని అర్జున్ తెలిపారు. ఐశ్వర్య కథానాయికగా అర్జున్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.