అర్జున్ సినిమా నచ్చకే బయటకు వచ్చేశా! : హీరో విశ్వక్ సేన్

అర్జున్ వెర్సెస్ విశ్వక్ సేన్ వ్యవహారం పతాక స్థాయికి చేరింది. విశ్వక్ సేన్‌కి కమిట్‌మెంట్ లేదని అర్జున్ ఆరోపించగా.. హీరో అంటే కనీస గౌరవాన్ని కూడా అర్జున్ చూపలేదంటూ విశ్వక్ సేన్ కౌంటరిచ్చాడు. దాంతో ఇప్పుడు? అర్జున్, విశ్వక్ సేన్ మధ్య వ్యవహారం మరింత ముదిరింది. యాక్టర్‌గా అందరికీ సుపరిచితుడైన సీనియర్ హీరో అర్జున్ సర్జా  స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి తనే నిర్మాత కూడా కాగా.. హీరోయిన్‌గా అతని కూతురు ఐశ్వర్య సర్జా చేస్తోంది. కానీ ఈ సినిమాలో తొలుత చేసేందుకు అంగీకరించినా… హీరో విశ్వక్ సేన్  సడన్‌గా షూటింగ్‌కి ముందు హ్యాండిచ్చాడని అర్జున్ ఆరోపించాడు. తొలుత కాల్‌షీట్స్ మార్చమని చెప్పాడని ఆ తర్వాత అడ్జెస్ట్ చేసినా మళ్లీ షూటింగ్‌కి రావడం లేదని అర్జున్ ఈరోజు చెప్పుకొచ్చాడు. షూటింగ్ ఆరింటికి ప్రారంభంకావాల్సి ఉండగా.. గంట ముందు షూటింగ్‌ని క్యాన్సిల్ చేయండి అని విశ్వక్ సేన్ నుంచి మెసేజ్ వచ్చిందని.. అతను కమిట్‌మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్ దుయ్యబట్టాడు. అర్జున్ ఆరోపణలపై విశ్వక్ సేన్ స్పందించాడు. సినిమా పాటలు, డైలాగ్, మ్యూజిక్ విషయంలో అర్జున్‌కి సూచనలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. కానీ అవేవీ అర్జున్ పట్టించుకోలేదని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. మూవీ విషయంలో తను చెప్పినట్లే నడుచుకోవాలని అర్జున్ మొండి పట్టుదలతో ఉన్నారని.. హీరోగా తనకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదని విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఆ సినిమా నుంచి బయటికి వచ్చినట్లు వివరణ ఇచ్చాడు. అర్జున్ ఆ సినిమా కోసం ఇచ్చిన రెమ్యూనరేషన్‌తో పాటు అగ్రిమెంట్ డ్యాకుమెంట్‌లను ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి పంపినట్లు వెల్లడించిన విశ్వక్‌సేన్.. వారితోనే చర్చించబోతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు అర్జున్ కూడా ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కి విశ్వక్ సేన్‌పై ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. అలానే మరో హీరోతో ఆ సినిమాని చేస్తానని కూడా అర్జున్ స్పష్టం చేశాడు.

Related Posts

Latest News Updates