భారతీయులు ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి తెలుసా?

చిన్నారుల సంరక్షణకు సంబంధించి పాశ్చాత్య దేశాల్లో చట్టాలు కఠినంగా అమలవుతుంటాయి. ఈ చట్టాలు, వారి అమలుపై సరైన అవగాహన లేక కొందరు భారతీయులు చిక్కులో పడుతుంటారు. 2008, 2015 మధ్య నానర్వే ప్రభుత్వం భారతీయ జంటలకు చెందిన 20 నవజాతి శిశువలను బాలల సంరక్షణాలయాలకు తరలించింది. అంతేకాకుండా మరో 13 మంది భారత సంతతి చిన్నారులకు తమ తల్లిదండ్రులకు దూరంగా ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రుల అనుమతితో నిమిత్తం లేకుండా ప్రభుత్వం పిల్లల్ని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలిచింది. అక్కడి చట్టాల ప్రకారం చిన్నారులకు తల్లిదండ్రుల కారణంగా హాని జరిగే అకాశం ఉందంటే చాలు ప్రభుత్వం పిల్లల బాధ్యతలను తనే తీసుకుంటుంది.

గతేడాది డిసెంబర్‌ 13న నార్వే చైల్డ్‌ సర్వీస్‌ అధికారులు అర్యన్‌ (5) అనే భారత సంతతి చిన్నారికి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆర్యన్‌ తండ్రి  నార్వేకు చెందిన వారు కాగా తల్లి మాత్రం భారతీయ పౌరురాలు. ఆర్యన్‌ తల్లిదండ్రులు  ఆ చిన్నారిపై  చేయి చేసుకున్నట్టు ఫిర్యాదు అందడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ముందుగా అతడు చదువుకుంటున్న స్కూల్లో వాకబు చేశారు. ఆ తరువాత ఆర్యన్‌ను తల్లిందండ్రులకు దూరంగా ఉంచడమే సముచితమని నిర్ణయించుకున్నారు. అయితే బిడ్డ కోసంమని తల్లిదండ్రులు పట్టువిడకుండా పోరాడటంతో రెండు నెలల తరువాత మళ్లీ పిల్లాడిని ఇంటికి తెచ్చుకోగలిగారు. అప్పటి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ జోక్యం చేసుకోవడంతో ఈ సమస్య వేగంగా పరిష్కారమైంది. ప్రస్తుతం నార్వే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం తుదుపరి ఏం నిర్ణయం తీసుకుంటుందో అనే ఆందోళనలో బతుకుతున్నారు.

నార్వే చట్ట ప్రకారం పిల్లల పట్ల హింసను అక్కడి ప్రభుత్వం ఏమాత్రం సహిచందు. పిల్లలు వారి హక్కులకు సంబంధించి నార్వే చాల స్పష్టమైన చట్టాలను రూపొందించింది. కొన్ని సందర్బారాల్లో ఇలాంటి కేసుల్లో ఇబ్బందులు తలెత్తాయి. అయితే  పిల్లల్ని వారి తల్లిదండ్రులకు దూరంగా తరలించాలా వద్దా అనే అంశంపై నార్వేలో చాలా కచ్చితమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వ నిర్ణయాలను కోర్టుల్లో సవాలు చేయచ్చు అని క్రిస్టీన్‌ తెలిపారు. అయితే విదేశీయలు సంస్కృతి, సంప్రదాయాలు, పిల్లల పెంపంకపై ఎన్‌సీడబ్యూలెస్‌కు అవగాహన తక్కువని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చట్టాల అమల్లో పౌరదర్శకతతో పాటు విదేశీ సంస్కృతిపై అవగాహనతో ఇటువంటి సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు.

Related Posts

Latest News Updates