స్టార్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా అప్సరా రాణి ‘రాచరికం’ ట్రైలర్ విడుదల

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ అనే చిత్రం తెరకెక్కింది. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లతో అందరిలోనూ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ కనించిన తీరు, డిఫరెంట్ లుక్స్, నటించిన విధానం చాలా కొత్తగా ఉంది. విలేజ్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

“రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి.. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్పా రక్త సంబంధాలు ఉండవు” అంటూ సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. విజువల్స్, యాక్షన్, బీజీఎం ఇలా అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ వేంగి, ఆర్య సాయి కృష్ణ కెమెరా వర్క్, రామ్ ప్రసాద్ మాటలు ఈ ట్రైలర్ కి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు.

నటీనటులు : అప్సర రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత: ఈశ్వర్
దర్శకత్వం: సురేష్ లంకపల్లి, ఈశ్వర్ వాసె
ఎడిటర్: జేపీ
డీఓపీ: ఆర్య సాయి కృష్ణ
సంగీతం: వేంగి
పీఆర్ఓ: సాయి సతీష్

Related Posts

Latest News Updates