ఏపీలోని వివిధ కేటగిరీల్లోని పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్4 మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ పోస్టులు, ఆయుర్వేద లెక్చరర్లతో సహా పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ గెజిటెడ్ 45 పోస్టులు, ఆయుర్వేద లెక్చరర్లు 3 పోస్టులు, హోమియో లెక్చరర్లు పోస్టులు 34, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టులు 72, హోమియో మెడికల్ ఆఫీసర్ 53 పోస్టులు, యునాని మెడికల్ ఆఫీసర్ పోస్టులు 26, ఏఈఈ పోస్టులు 23, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 7 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.