ఏపీ టీచర్లనుద్దేశించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. హరీశ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని హరీశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉపాధ్యాయులకు మంచి ఫిట్ మెంట్ ఇచ్చామని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
అయితే తెలంగాణ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమర్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ పై కోపం వుంటే హరీశ్ ఆయననే విమర్శించాలి కదా అంటూ చురకలంటించారు. మమ్మల్ని తిడితే వారికి మార్కులు పడతాయా? అంటూ ఫైర్ అయ్యారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కామెంట్స్ చేశారు. హరీశ్ రావు ఒక్కసారి ఏపీకి వచ్చి చూస్తే.. తాము టీచర్లకు ఏం చేశామో అర్థమవుతుందన్నారు. ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగానే వున్నారని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణలో ఇచ్చిన పీఆర్సీలో తేడా చూస్తే తెలుస్తుందని బొత్స సత్యనారాయణ సెటైర్ వేశారు.
ఇక… ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా హరీశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీశ్ ఎందుకు అలా మాట్లాడారో తమకు తెలియదన్నారు. వారి సమస్యలు వారు చూసుకోకుండా.. తమపై కామెంట్ చేయడం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై మాట్లాడితే బాగుటుందని, ముందు తెలంగాణ సమస్యపై మాట్లాడాలని సజ్జల అన్నారు.