బీఆర్ఎస్ లో ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి చేరారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వీరు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరిని సీఎం కేసీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వీరితో పాటు టీజే ప్రకాశ్(అనంతపురం), తాడివాక రమేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్ నాయుడు(కాపునాడు, ప్రధాన కార్యదర్శి), రామారావు(ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు) కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ను ఏపీలోనూ విస్తరిస్తారని, ఇందుకు కేసీఆర్ వ్యూహం కూడా పన్నారన్న వార్తలు వచ్చాయి. వీరి చేరికతో అది రూఢీ అయ్యింది. అయితే… ఎక్కువగా టీడీపీ నుంచే వలసలు వుంటాయన్న పుకార్లు కూడా జరిగాయి. ఇక… రానున్న రోజుల్లో ఏపీ నుంచి మరిన్ని చేరికలు వుంటాయని బీఆర్ఎస్ ప్రకటించింది.