ఏపీ మంత్రి విడదల రజనీకి హైకోర్టు నోటీసులు

ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ జారీ చేసే అంశంలో నోటీసులు జారీ అయ్యాయి. చిలకలూరి పేట మండలం మురికిపూడి అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చేయడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వడంపై అసైన్డ్ రైతులు అభ్యంతరం తెలిపారు. అసైన్డ్ రైతులను బెదిరించి చట్టవిరుద్ధంగా ఎన్‌వోసీ ఇచ్చారని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో మంత్రి విడదల రజిని, అధికారులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పిటిషన్లపై కోర్టు తుది నిర్ణయానికి లోబడి లీజు ఖరారు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

Related Posts

Latest News Updates