ఏపీలో చర్చిల నిర్మాణానికి 175 కోట్లు… కోర్టుకు వెళ్తామంటున్న బీజేపీ

రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల నిర్మాణానికి సీఎం జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి, మరమ్మతుల కోసం 175 కోట్లను అందించనుంది. ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున కేటాయించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాత వాటిని పునరుద్ధరణ, వాటికి కావాల్సిన మరమ్మతులు, శ్మశాన వాటికల ఆధునికీకరణ కోసం ఈ నిధులు వాడుకోవాలని ప్రభుత్వం చర్చి యాజమాన్యాలకు సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ సూచించింది. ఈ నెల 19 లోగా ప్రతిపాదనలు అందించాలని సూచించారు.

 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ ధనాన్ని చర్చిలకు ఎలా కేటాయిస్తారని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. ఏపీలో ఇళ్ల నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాల కోసం చేపట్టిన భూ కొనుగోళ్లల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాజధాని విషయంలో టీడీపీ వైసీపీ మిలాఖత్ అయ్యాయని, రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, ఈ ప్రభుత్వం వాటి గురించి అడగడం లేదని సోము వీర్రాజు మండిపడ్డారు.

Related Posts

Latest News Updates