ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్ ప్లాన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ ను మరో 10 సంవత్సరాల పాటు కొనసాగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సబ్ ప్లాన్ గడువు ఈ నెల 23 తో ముగియనుంది. దీంతో దీనిని పొడిగించేందుకు ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు స్వాగతించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల పట్ల సీఎం జగన్ కి వున్న ప్రేమ మరో సారి నిరూపితమైందని మంత్రి మేరు నాగార్జున పేర్కొన్నారు.












