ఏపీలో కొత్త రెవిన్యూ డివిజన్.. చింతూరును ప్రకటిస్తూ ఉత్తర్వులు

ఏపీలో మరో కొత్త రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చింతూరు రెవిన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో కలిపి చింతూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఈ రెవిన్యూ డివిజన్ లో ఏటిపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలు వుంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక… స్థానికులు సీఎం జగన్ కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు ప్రకటించారు.

Related Posts

Latest News Updates