ఏపీలో విద్యాశాఖ సంక్రాంతి సెలవులను సవరిస్తూ.. తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. మళ్లీ ఈ నెల 19 న పాఠశాలలు పున: ప్రారంభమవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత… అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం… 11 నుంచి 16 తేదీ వరకే సెలవులని పేర్కొంది. అయితే… ముక్కనుమను కూడా వుండటంతో సెలవులను పొడగించింది. సంక్రాంతి సెలవుల్లో మార్పులు తేవాలని ఉపాధ్యాయ సంఘాలు మంత్రి బొత్సను కోరాయి. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
