అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్దేశించిన చట్టసవరణలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చట్ట సవరణకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంతో పాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్ట సవరణ జరిగింది. మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు.