ఏపీకి ఫిషరీ యూనివర్శిటీ… ప్రకటించిన సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా 3,300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు వుందన్నారు. ఫిషరీస్ యూనివర్శిటీ ఏపీలో రాబోతోందని, 332 కోట్లతో ఫిషరీస్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఫిషరీస్ వర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే వున్నాయని, ఇప్పుడు ఏపీకి రాబోతోందని ప్రకటించారు. ఫిషరీస్ యూనివర్శిటీతో నర్సాపురం రూపు రేఖలు మారిపోతాయని అన్నారు.

 

ఇక… వేట ఉపాధి కోల్పోయిన వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం జగన్ గుర్తు చేశారు. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నామని, జగనన్న ప్రభుత్వం అంటేనే తమ ప్రభుత్వం అన్న భరోసా వచ్చేలా పాలన చేస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాము నెరవేరుస్తున్నామని అన్నారు. గత పాలకుల ఊహకు అందని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నట్లు సీఎ జగన్ తెలిపారు.

Related Posts

Latest News Updates