ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. పోలవరం ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి ప్రధానితో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఏపీకి రుణ పరిమితి పెంపుపై కూడా చర్చిచారు. అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కూడా సీఎం జగన్ ప్రధాని ముందు ప్రస్తావించారు. వీటన్నింటితో పాటు రుణ పరిమితిలో కోతలు, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై కూడా చర్చించారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా రుణాలు తీసుకుందని, తాము ఇప్పుడు సర్దుబాటు చేస్తుంటే కేంద్ర ఆర్థిక శాఖ రుణాలపై పరిమితి విధిస్తోందని సీఎం ప్రధానికి వివరించారు. కేటాయించిన రుణ పరిమితిలోనూ ఆర్థిక శాఖ కోత విధిస్తోందని, రుణ పరిమితిపై వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు.

1. విభజన చట్టంలో ఇంకా అమలు కాని హామీలను పరిష్కరించాలి. మొత్తంగా 32,625.25 కోట్ల పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలి.

2. పోలవరం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన 2,937.92 కోట్లు వెంటనే చెల్లించాలి. పోలవరం పునరావాసానికి 10,485.38 కోట్లను మంజూరు చేయాలి.

3. ఏపీకి ప్రత్యేక హోదాపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి.

4. 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలి.

5. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన 6,886 కోట్ల కరెంట్ బకాయిలను వెంటనే ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో వున్న ఏపీ జెన్ కోకు ఇవెంతో ఉపకరిస్తాయి.

6. రాష్ట్రంలో అర్హత పొందిన 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడంలేదు. వీరికి రాష్ట్రమే సొంతంగా అందిస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలి.

Related Posts

Latest News Updates