బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నుంచి డైవర్ట్ చేయడానికే ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు గనక నిజమైతే… ఆ సర్వే నెంబర్ లోని 90 శాతం భూమిని రఘునందన్ రావే తీసుకోవాలని, మిగిలిన 10 శాతం తనికిస్తే చాలన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని తోట చంద్రశేఖర్ హితవు పలికారు. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తామన్నారు.
తెలంగాణ ఆస్తులను సీఎం కేసీఆర్ ఆంధ్రవారికి కట్టబెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆ డబ్బులతోనే తోట చంద్రశేఖర్ తో బీఆర్ఎస్ సభకి ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. హఫీజ్ పేటలోని 78 సర్వే నెంబర్ భూములను తనఖా పెట్టి, ఎంబీఎస్ జువెలర్స్ సుఖేశ్ గుప్తా రుణం తీసుకున్నారని అన్నారు. ఇదే సర్వే నెంబర్ లో 40 ఎకరాల భూమి ఆదిత్య కంపెనీ పేరుతో తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారని రఘునందన్ ఆరోపించారు.